76 పోస్టులకు ఐదు వేల మంది 

76 పోస్టులకు ఐదు వేల మంది 
  • ఇందిరమ్మ ఇండ్లు, టవర్ల స్కీమ్ సివిల్ ఇంజనీర్ పోస్టులకు ఫుల్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనుల పర్యవేక్షణ కోసం సివిల్ ఇంజనీర్ల నియామకానికి అనూహ్య స్పందన లభించింది. హౌసింగ్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డులు వేర్వేరుగా విడుదల చేసిన నోటిఫికేషన్లలో మొత్తం 76 పోస్టులకు ఏకంగా 5,000 మందికి పైగా బీటెక్ (సివిల్) అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్లను హౌసింగ్ అధికారులు పరిశీలించి, బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కులలో 85 శాతానికి పైగా సాధించిన మెరిట్ అభ్యర్థులను, రిజర్వేషన్ల నిబంధనల ఆధారంగా షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్ చేశారు.

ఇలా ఎంపికైన అభ్యర్థులు వచ్చే నెల నుంచే తమ విధుల్లో చేరనున్నారు. హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 51 పోస్టుల కోసం 2,500 మంది దరఖాస్తు చేయగా, అధికారులు మొదట 150 మందిని షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్ చేశారు. ఆ తర్వాత 1:3 నిష్పత్తిలో తుది జాబితాను ఎంపిక చేశారు. నియోజకవర్గానికి ఒక సివిల్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేటాయించి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులను పర్యవేక్షిస్తారు.

గతంలో ఉన్న 350 మంది ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరు రాజీనామా చేయడంతో, వారి స్థానంలో కొత్తగా ఏడాది కాలపరిమితితో ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ ప్రాతిపదికన వీరిని నియమిస్తున్నారు. మరోవైపు హౌసింగ్ బోర్డు పరిధిలోని ఇందిరమ్మ టవర్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 25 మంది సివిల్ ఇంజనీర్లను ఎంపిక చేశారు. క్యూఆర్ పరిధిలో చేపట్టే ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పర్యవేక్షణకు కూడా నియోజకవర్గానికి ఒకరి చొప్పున నియమించనున్నారు. హౌసింగ్ బోర్డులో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, అలాగే నిర్మాణాలు వేగంగా జరుగుతుండటంతో ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలను పూర్తి చేశారు.